|
డి.ఎస్.-నో డిపాజిట్ -నో సీట్ -విజయశాంతి |
|
|
|
|
Friday, 30 July 2010 |
|
తెలంగాణా వాదాన్ని ఉపఎన్నికలలో గెలిపించిన ప్రజలకు టి.ఆర్.ఎస్. నాయకురాలు విజయశాంతి కృతజ్ఞతలు తెలియజేశారు. ధరావతులు సైతం కాపాడుకోలేకపోయిన తెలుగుదేశం పార్టీకి ఇక తీర్థయాత్రలే గతి అని ఆమె దేశం బాబ్లీ యాత్రపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. క్రిందటి ఎన్నికలలో తెలంగాణాలో ప్రజారాజ్యం గల్లంతు కాగా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గల్లంతు అయ్యిందని ఆమె విశ్లేషించారు.
ఈ ఉపఎన్నికలలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లక్ష్మీ నారాయణ చేతిలో రెండోసారి ఓడిపోయిన పి.సి.సి. అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేరులోని రెండు అక్షరాలైన డి.ఎస్.కు విజయశాంతి ఆసక్తిదాయకమైన వివరణ ఇచ్చారు. ఆ పేరులోని డి అంటే నో డిపాజిట్ అని,ఎస్ అంటే నో సీట్ అని విజయశాంతి భాష్యం చెప్పారు. |